EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు 8.15 శాతం వాటా ఇవ్వాలని ఇంతకుముందు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 24 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ ఖాతాల్లో వడ్డీ జమ చేశామని కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల ప్రకటించారు.
ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ కావడంపై ఈపీఎఫ్ఓ వివరణ ఇచ్చింది. ‘ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమ చేసిన వివరాలు త్వరలో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయి. ఒకసారి వడ్డీ జమ అయితే తర్వాత పూర్తిగా జమ అయిన తర్వాత మీ ఖాతాలో కనిపిస్తుంది. సంయమనం పాటించండి’ అని ఈపీఎఫ్ఓ వివరణ ఇచ్చింది.
ఈఫీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిన తర్వాత వారీ పీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు చూసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పలు పద్దతులు ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈపీఎఫ్ఓ యాప్ లో రిజిస్టర్ కావాలి.
‘సర్వీస్’ విభాగంలోకి వెళ్లి .. ఎంప్లాయి సెంట్రిక్ సర్వీస్.. ‘వ్యూ పాస్ బుక్’ ఎంచుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్ తోపాటు తదుపరి వచ్చే సూచనలకు అనుగుణంగా ముందుకెళితే మీ ఈపీఎఫ్ పాస్ బుక్ ఓపెన్ కావడంతోపాటు అందులో ఎంత బ్యాలెన్స్ అవుతుందో తెలుస్తుంది.
ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్లి ‘అవర్ సర్వీసెస్’ .. అటుపై ‘ఫర్ ఎంప్లాయీస్’ సెక్షన్ ఎంచుకోవాలి. అక్కడ ‘మెంబర్ పాస్‌బుక్ ఓపెన్ చేయాలి. అటుపై సర్వీసెస్ లోకి వెళ్లి మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
యూఏఎన్ ఖాతాతో లింక్డ్ చేసి ఉంటే.. మీ కంట్రిబ్యూషన్, పీఎఫ్ బ్యాలెన్స్ కోసం 7738299899 అనే నంబర్‌కు EPFOHO UAN ENG ఎస్ఎంఎస్ పంపాలి.. ENG భాషకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
రిజిస్టర్డ్ యూజర్లు 011-22901406 ఫోన్ నంబర్‌కు మీ రిజిస్టర్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ నంబర్, ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్ తెలియజేస్తే ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుస్తాయి. దీనికి ఎటువంటి చార్జీ విధించరు.