హైదరాబాద్, నవంబర్ 8: ఎంటార్ టెక్నాలజీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.20.5 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.24.7 కోట్ల లాభంతో పోలిస్తే 17 శాతం తగ్గింది. కానీ, కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.166.8 కోట్లకు పడిపోయింది.