హైదరాబాద్, జనవరి 23: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ రంగంలో ఉన్న ఎంకోర్-ఆల్కమ్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. రూ.60 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని సూరత్ వద్ద నూతన ప్లాంట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
1.84 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ తొలి ఆటో రోబోటిక్ యూనిట్ అని కంపెనీ సీఎండీ శివ కోటిరెడ్డి తెలిపారు.