నిమ్జ్‌తో 3 లక్షల మందికి ఉపాధి
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.
- రూ.100 కోట్లతో ప్రత్యేక రహదారులు
- పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ఊతం
- డిసెంబర్ నాటికి రోడ్డు పనులు పూర్తి
జహీరాబాద్, సెప్టెంబర్ 9: పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. దీంట్లోభాగంగానే వెనకబడిన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)ను ఏర్పాటు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వం 12,635 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. దీంతో నిమ్జ్‌కు మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులను సర్కార్ వెచ్చిస్తున్నది.
ఇందులో భాగంగా నిమ్జ్‌కు 65వ జాతీయ రహదారి నుంచి ప్రత్యేకంగా రవాణా సదుపాయాలు కల్పించడానికి ఆరు లైన్లలో రోడ్డును నిర్మిస్తున్నది. 9.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 65 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అక్కడి రెవెన్యూ అధికారులు సేకరించగా..మరో ఐదు ఎకరాల భూమికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నది. కోర్టు ఆదేశాలు రాగానే ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. ఇప్పటికే రైతులకు నష్ట పరిహారంగా ప్రభుత్వం రూ. 7.50 కోట్లు చెల్లించింది. ఈ నిమ్జ్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి.
విశాలమైన రోడ్లు..
నిమ్జ్‌లో ఉత్పత్తి చేసే పరికరాలను భారీ వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు 65వ జాతీయ రహదారికి లింక్ రోడ్డును ఆరు లైన్లతో నిర్మిస్తున్నారు. డిసెంబర్ నాటికి రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులను వేగవంతం చేస్తున్నారు. రైతులు సహకరించి ముందుకు వస్తే నవంబర్ చివరిలోగా పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి రోడ్డు అప్పగిస్తామని అధికారులు అంటున్నారు. కొందరు రైతులు రోడ్డు పనులు అడ్డుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.
- నిమ్జ్ ఏర్పాటుతో 2.66 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ పలు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
- వీటిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ట్రైటాన్ ఇక్కడ ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది. రూ.2,100 కోట్ల తో 150 ఎకరాల స్థలంలో యూనిట్‌ను ప్రారంభించాలనుకుంటున్నది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- జర్మనీకి చెందిన లైట్ ఆటో రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ఈ యూనిట్‌తో 9 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది.
- రూ.1,000 కోట్ల తో వేమ్ టెక్నాలజీస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. 511 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌తో ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
- రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 2022 జూన్ 22న వేమ్ టెక్నాజీస్ పరిశ్రమకు భూమిపూజ కూడా చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- employment
- Nimz
- Roads
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

