న్యూఢిల్లీ, జూలై 1 : భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించడంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఇందుకు కావాల్సిన అన్ని రెగ్యులేటరీ, లైసెన్సింగ్ అనుమతుల్ని స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ అందుకోవడం గమనార్హం. దీంతో త్వరలోనే మెగా స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం దేశీయ వినియోగదారులకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని టెక్నికల్, ప్రొసీజరల్ పనులు మిగిలే ఉన్నాయని దేశీయ స్పేస్ రెగ్యులేటర్ ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా తెలిపారు.
ఆథరైజేషన్ పూర్తయినా.. వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాలనే కొద్ది నెలల సమయం పడుతుందని గోయెంకా చెప్తున్నారు. అయినప్పటికీ తుది ఆమోదం త్వరలోనే లభిస్తుందన్న సంకేతాలను ఇవ్వడం విశేషం. ఇక ఇప్పటికే స్టార్‌లింక్‌కు టెలికం శాఖ నుంచి లైసెన్స్ వచ్చింది. సెకనుకు 600-700 గిగాబైట్ల స్పీడ్‌తో ఇంటర్నెట్ను స్టార్‌లింక్ అందించనున్నది. అయితే దీని ధరల్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.