Elon Musk on Crypto Trade | క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదేనీ సెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ఆమోదించడం లేదని తేల్చేశారు. తొలి నుంచి క్రిప్టో కరెన్సీలకు ఎలన్‌మస్క్ గట్టి మద్దతుదారుగా ఉన్నారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే మదుపర్లు.. వాటి ‘కీ’ లను వారి కస్టడీలోనే ఉంచాలని కోరుకుంటున్నారు. రాబిన్ హుడ్, బినాన్స్ వంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లను ఆమోదించలేనన్నారు.
ఇటీవల బినాన్స్ సీఈవో చాంగ్‌పెంగ్ ఝావో, ఎలన్‌మస్క్ మధ్య ట్విట్టర్ వేదికగా భారీగా వాగ్వాదం చోటు చేసుకుంది. డోజ్కాయిన్ మదుపర్ల ఆందోళనను మస్క్.. చాంగ్‌పెంగ్ ఝావో దృష్టికి తెచ్చారు. ప్రత్యేకించి బినాన్స్ ఎక్స్చేంజ్ యాజమాన్యం.. డోజికాయిన్ లావాదేవీల్లో ఎర్రర్స్ వస్తున్నాయని తేలింది. కొందరు కస్టమర్ల ఖాతాలను స్తంభింపజేసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. మస్క్ వెంచర్లలో పెట్టుబడిదారు బిల్ లీ కూడా క్రిప్టో కరెన్సీ మదుపర్ల వద్దే తమ లావాదేవీల కీ వర్డ్స్ ఉండాలన్న ప్రతిపాదనకు మద్దతు పలికారు. బినాన్స్ ఎక్స్చేంజ్ తమ వద్దే మదుపర్ల కీ వర్డ్స్ అట్టి పెట్టుకుంటున్నది.
ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీల్లో రెండు రకాలు. కొన్ని ఎక్స్చేంజ్లు సెంట్రలైజ్డ్గా నడుస్తుండగా, మరికొన్ని డీ సెంట్రలైజ్డ్గా ఉన్నాయి. ఈ రెండు క్యాటగిరీల ఎక్స్చేంజీల్లోనూ బెనిఫిట్లు, సేఫ్టీ రూల్స్, ఇబ్బందులు ఇమిడి ఉన్నాయి. క్రిప్టో వాలెట్ స్టోర్స్ వద్ద ప్రైవేట్ కీలు ఉంటాయి. బిట్ కాయిన్, ఎథిరియం వంటి క్రిప్టో కరెన్సీలను అందుకోవడానికి, పంపడానికి మదుపర్లకు సదరు క్రిప్టో వాలెట్ స్టోర్స్ యాజమాన్యాలు తమ వద్ద కీ వర్డ్స్ అందజేస్తాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించిన స్టోర్‌లో క్రిప్టో కాయిన్లు ఉంటాయి. ప్రైవేట్ కీ నమోదు చేస్తేనే మరొకరి వాలెట్‌లోకి నగదు పంపడానికి వీలవుతుంది. ఒకవేళ ఆ కీ వర్డ్ మర్చిపోతే ఇంతే సంగతులు.. ఇదే క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో అతిపెద్ద ముప్పు.
యూజర్ల నిర్వహణ తీరుపైనే ఆయా వాలెట్ల సేఫ్టీ ఆధార పడి ఉంటుంది. ఆన్లైన్ వాలెట్లు సైబర్ దాడుల బారీ పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆఫ్‌లైన్ వాలెట్‌తో లావాదేవీలు జరపటం మీ క్రిప్టో కరెన్సీకి భద్రత ఉంటుంది. డెస్క్‌టాప్, మొబైల్, స్పెషిఫికల్లీ డిజైన్డ్ హార్డ్‌వేర్‌తో మాత్రమే ఆఫ్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలి. కానీ దీనికి ఒకటి కంటే ఎక్కువ సార్లు అథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజీల మాదిరిగా డీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు తమ మదుపర్లకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ అందించవు. వీటిని ఆపరేట్ చేయడం సంక్లిష్టంగా ఉంటుంది. సెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీల్లోనే మెజారిటీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మార్కెట్ లావాదేవీలు తారుమారు చేయడం కష్టం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. డీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల్లో పేర్లు నమోదు చేసుకున్న యూజర్లు తొలుత తమ క్రిప్టో వాలెట్లతో కనెక్ట్ కావడం దుర్బరమైన సమస్యగా పరిణమిస్తోంది. హ్యాకింగ్ రిస్క్ తక్కువగా ఉన్న డీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజీలు ఉత్తమం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.