Elon Musk on iPhone 15 | ఆపిల్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్15 సిరీస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ప్రియులు ఆపిల్ స్టోర్ల ముంగిట బార్లు తీరుతున్నారు. అంతేకాదు.. తాము ఐఫోన్ 15 కొనుగోలు చేయడానికి కారణాలు చెబుతూ.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. ఆ జాబితాలో ఎలక్ట్రిక్ కార్లు టెస్లా – సోషల్ మీడియా సంస్థ చీఫ్ ఎలన్ మస్క్ జత కలిశారు.
తాను ఐఫోన్15 ఎందుకు కొనుగోలు చేస్తున్నానన్న సంగతి ఎలన్ మస్క్ బయట పెట్టారు. ఐఫోన్15తో తీసే ఫొటోలు, వీడియోలు అందంగా, అపురూపంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ కామెంట్‌పై నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏ కలర్ ఫోన్ కొన్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు కొందరు పోస్ట్ చేస్తే.. మరి కొందరు తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో వాణిజ్య ప్రకటనల కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం న్యూయార్క్‌లోని ఆపిల్ స్టోర్ వద్ద ఐ-ఫోన్ ప్రియుల సందడి ఫొటోలు ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఫొటో గ్రాఫర్లు స్టీఫెన్ విల్క్స్, రూబెన్ వూ తదితరులు ఐఫోన్15 ప్రో మ్యాక్స్ తో తాము చిత్రించిన ఫొటోలను.. ‘ఎక్స్’ ద్వారా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు షేర్ చేశారు. ఐఫోన్‌తో పరిమితుల్లేని సృజనాత్మకత సృష్టించొచ్చునని వారు నిరూపించారని టిమ్ కుక్ పేర్కొన్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా టిమ్ కుక్ షేర్ చేశారు.