
Elon Musk | ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్ల వ్యక్తిగత సంపదలో 2021లో అదనంగా 402.17 బిలియన్ల డాలర్లు జత కలిశాయి. గమ్మత్తేమిటంటే భారత్ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 635 బిలియన్ల డాలర్లు. ఇక యధా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్లసంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ ఈ ఏడాది సంపాదించిన నికర వ్యక్తిగత ఆదాయం సుమారు 300 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది మస్క్ అదనంగా 121 బిలియన్ల డాలర్లు సంపాదించారు. ఈ నెల 29న మస్క్ నికర సంపద 277 బిలియన్ల డాలర్లు.
రెండో స్థానంలో కొనసాగుతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపదలో ఈ ఏడాది పెద్దగా అదనపు సొమ్ము చేరలేదు. కేవలం 500 కోట్ల డాలర్లు మాత్రమే జత కలిశాయి. దీంతో జెఫ్ బెజోస్ నికర వ్యక్తిగత సంపద 195 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫ్రాన్స్ లగ్జరీ గ్రూడ్స్ తయారీ సంస్థ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ వ్యక్తిగత సంపద 2021లో 61 బిలియన్ల డాలర్లు పొగు పడింది. లూయిస్ చిరిస్టియన్ డియోర్, గివెంచీ వంటి బ్రాండ్లు.. ఎల్వీఎంహెచ్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న దాత, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ వ్యక్తిగత సంపద 2021లో 139 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది కొత్తగా ఏడు బిలియన్ల డాలర్లు జత కలిసింది.
గూగుల్ కో ఫౌండర్ ల్యారీ పేజ్ నికర సంపద 2021లో 130 బిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 47 బిలియన్ల డాలర్లు జత కలిసింది. ఆరో స్థానంలో ఉన్న మెటా ఫ్లాట్మాప్స్ అనుబంధ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 128 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది అదనంగా 24 బిలియన్ డాలర్లు చేరాయి. మెటా (ఫార్మర్లీ ఫేస్బుక్)లో మార్క్ జుకర్‌బర్గ్ వాటా 13 శాతం. ఈ ఏడాది దాని విలువ 20 శాతానికి పైగా పెరిగింది.
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో, ఎన్బీఏ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ ఓనర్ స్టీవ్ బాల్మేర్ ఖాతాలో అదనంగా 41 బిలియన్ల డాలర్లు జత కలిసింది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద 122 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. క్లౌడ్ మేజర్ ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎల్లిసన్ సంపద 109 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఈ ఏడాది కొత్తగా ల్యారీ ఎల్లిసన్ వ్యక్తిగత సంపద 29 బిలియన్ల డాలర్లు పెరిగింది. ఇక బార్క్‌షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్ 10వ స్థానంలో నిలిచారు. ఆయన వ్యక్తిగత సంపద 109 బిలియన్ డాలర్లకు చేరింది. 2021లో కొత్తగా 21 బిలియన్ల డాలర్లు పెరిగింది.