న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్(భెల్) మరో ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.22.87 కోట్ల విలువైన కవాచి పరికరాల సరఫరా, ఇన్స్టాల్ చేసే ఆర్డర్ పొందింది. దీంతో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది.
ఇందుకు సంబంధించి ఈ నెల 11న లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పొందినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లోభాగంగా డిజైనింగ్, డెవలప్మెంట్, సరఫరా, ఇన్స్టాలేషన్, ట్రయల్, కమిషనింగ్ చేయాల్సివుంటుందని పేర్కొంది.