న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా స్పీడ్ పెంచింది. ఒకేసారి దేశవ్యాప్తంగా 3,200 అవుట్లెట్లను తెరిచింది. దీంతో మొత్తం అవుట్లెట్ల సంఖ్య 4 వేలకు చేరుకున్నాయి.
కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మెట్రో, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం స్టోర్లను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఎండీ భావిశ్ అగర్వాల్ తెలిపారు. దీంట్లోభాగంగా హైదరాబాద్‌లోనూ స్టోర్‌ను ప్రారంభించింది. సర్వీస్ సెంటర్ కలుపుకొని ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పూర్తిగా ఆధునీకరించినట్లు చెప్పారు.