EV Charging | పెట్రోల్ కన్నా చౌక .. ఈవీ చార్జింగ్ రేట్స్ఇలా…. ఏప్రిల్ నుంచి అమలు?!
EV Charging | హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

EV Charging | దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో విద్యుత్ వాహనాల వాడకం మొదలైంది. విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్ కీలకం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వాసులు కూడా విద్యుత్ వాహనాలు వాడుతున్నారు. వారి విద్యుత్ వాహనాల బ్యాటరీ చార్జింగ్కు రేట్లు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈవీ చార్జింగ్కు సర్వీస్ చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలియవచ్చింది. జీఎస్టీ కూడా అదనం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ రేట్లు అమలులోకి వస్తాయని సమాచారం.
ఫేమ్-2 కింద చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఒక కిలోవాట్ యూనిట్ విద్యుత్ చార్జింగ్కు రూ.12.02 చెల్లించాల్సి ఉంటుందని వినికిడి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 118 వెహికల్ చార్జింగ్ స్టేషన్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్సీడీసీవో) ప్రకటించింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ విహికల్స్ (ఫేమ్)-2 స్కీం కింద ఈ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది.
మార్చికల్లా అందుబాటులోకి అన్ని ఈవీ స్టేషన్లు
విద్యుత్ వాహనాల వాడకాన్ని భారీ పరిశ్రమలశాఖ ప్రోత్సహిస్తున్నది. 118 ఈవీ చార్జింగ్ స్టేషన్లతోపాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో మరో 20 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో కలిపి మొత్తం 138 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని చార్జింగ్ స్టేషన్లు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం అవుతాయని తెలుస్తున్నది. హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లు.. ప్రైవేట్ వ్యక్తులు.. సంస్థల ఆధీనంలోనే ఉంటాయి.
కారు చార్జింగ్కు రూ.300 చెల్లించాల్సిందే..
ప్రభుత్వ రంగ చార్జింగ్ స్టేషన్లలో ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కంటే రూ.12.02లకే కిలోవాట్ విద్యుత్ చార్జింగ్ చాలా చౌక అని టీఎస్ఆర్ఈడీసీవో వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఒక కారుకు పూర్తి చార్జింగ్ చేయాలంటే 25 యూనిట్లు కావాలి. అంటే మొత్తం రూ.300 చెల్లించాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

