ముంబై, ఏప్రిల్ 22: అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ వైఎల్ మాడల్ ధర రూ.61.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే విడుదల చేసిన వై మాడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నూతన మాడల్‌ను పరిచయం చేసింది. 5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 681 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ప్రీమియం ఎస్యూవీ వాహన విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చినట్టు టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ తెలిపారు.
హైదరాబాద్‌లో షోరూం..
టెస్లా హైదరాబాద్‌లో షోరూంను ఏర్పా టు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ నగరాల్లో మూడు ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్వహిస్తున్న సంస్థ..వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్‌తోపాటు బెంగాల్, చెన్నై, అహ్మదాబాద్‌లలో షోరూంలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్ విడుదల చేసిన ఈక్యూఎస్ మాడల్‌కు పోటీగా టెస్లా ఈ నూతన కారును ప్రవేశపెట్టింది.