Infosys-TCS | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 స్క్రిప్ట్ల్లో 8 స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 98,234.82 కోట్లు పెరిగింది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లాభ పడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 817.68 పాయింట్లు (1.42 శాతం) లాభంతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,170.02 కోట్లు పెరిగి రూ.6,80,182.93 కోట్లకు చేరుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.23,582.58 కోట్లు లాభపడి రూ.12,31,362.26 కోట్ల వద్ద స్థిర పడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17,048.21 కోట్లు పెంచుకుని రూ.17,14,256.39 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,861.32 కోట్ల వృద్ధితో రూ.5,83,261.75 కోట్ల వద్ద నిలిచింది.భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,008.75 కోట్ల వృద్ధితో రూ.4,34,748.72 కోట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.5,709.2 కోట్లు పెరిగి రూ.4,42,157.08 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,186.53 కోట్లు అభివృద్ధి చెంది రూ.4,73,584.52 కోట్ల వద్దకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.1,668.21 కోట్లు పెరిగి రూ.6,21,220.18 కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,599.68 కోట్లు నష్టపోయి రూ.4,27,079.97 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 4,390.73 కోట్ల పతనంతో రూ.7,92,860.45 కోట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ లీడ్లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.