Vicky Kaushal | ‘లవ్ అండ్ వార్’.. విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్!
Love & War | బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ (Love & War).
Love & War | బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ (Love & War). రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
విడుదలైన పోస్టర్లో విక్కీ కౌశల్ చేతిలో సిగరెట్, లైటర్‌తో ఎంతో సీరియస్‌గా, ఇంటెన్స్‌గా చూస్తున్న లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. నజరే మిలేంగీ, లేకిన్ హటేంగీ నహీ (చూపులు కలవొచ్చు.. కానీ పక్కకు తప్పుకోవు) అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. భన్సాలీ చిత్రాల్లో ఉండే ప్రత్యేకమైన గ్రాండియర్, పాత్రల తీవ్రత ఈ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ ఆఫీసర్లుగా నటిస్తుండగా, వారిద్దరి మధ్య అలియా భట్ పాత్రతో ముడిపడి ఉన్న ఒక బలమైన ట్రాయంగిల్ కథాంశంతో ఇది తెరకెక్కుతోందని తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంటోంది. రణ్‌బీర్, అలియా మరియు విక్కీ పాత్రల ఫస్ట్ లుక్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేశాయి. ఈ మోస్ట్ అవైటెడ్ విజువల్ వండర్ 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Nazre milengi, lekin hatengi nahin! 🧿
Sanjay Leela Bhansali’s Love & War on 21st January 2027 ❤️
See you at the movies! 🎬#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 #PrernaSingh pic.twitter.com/6v6NdTxFV1
— BhansaliProductions (@bhansali_produc) September 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

