‘చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిది’
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దోపిడి అణచి వేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ అని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు..
– బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దోపిడి అణచి వేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ అని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పట్టణంలోని హనుమాన్ పేటలోని ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన భూమి హక్కును కాపాడుకోవడానికి భూస్వామ్య శక్తులకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి ఐలమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని తెగవను అందించారన్నారు. ఆ మహనీయురాలి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబింగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్ రజక, బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, సామాజికవేత్త ఉద్యమకారుడు ఎండీ మహమ్మద్ కొత్తగూడెం, బీసీ విద్యార్థి పట్టణ కార్యదర్శి నక్క నాగరాజ్ ముదిరాజ్, బీసీ యువజన నాయకులు తాడూరి సైదులు రజక, తుపాకుల తుకారం రజక, భీమరాజ్ యర్రబెల్లి వెంకన్న రజక పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

