Janagama | సభలో మంత్రి పొంగులేటిని నిలదీసిన మహిళలు..ఇచ్చిన హామీలపై నిలదీతలు
Janagama | మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కి జనగామ జిల్లా కేంద్రంలో మహిళల నుంచి నిరసన వ్యక్తమయ్యింది.
జనగామ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti ) కి జనగామ ( Janagama ) జిల్లా కేంద్రంలో మహిళల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ( Promises ) ఎందుకు అమలు చేస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జనగామ ప్రెస్టన్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతుండగా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మహిళలు ప్రసంగానికి అడ్డుపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్దే తప్ప తమ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని నిలదీశారు. పెన్షన్ 4 వేలు చేస్తానని చెప్పిండ్రు కదా. ఏది అంటూ మంత్రిని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ వాళ్లకే ఇచ్చుకున్నారు. నిజమైన పేదవాళ్లకు ఎవరికి ఇచ్చిండ్రో చూపియ్యండి అంటూ మంత్రిని నిలదీశారు. అన్ని దొంగ మాటలు చెప్తున్నారు. అంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 500 లకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు వెయ్యి రూపాయలు చేసిండ్రు. 500 కు గ్యాస్ ఎవరికి ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేశారు. మహిళలు నిలదీస్తుండగా అడ్డుకున్న పోలీసుల పైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

