Reliance | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,173.42 కోట్లు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా లబ్ధి పొందాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ తదితర సంస్థలు లాభ పడ్డాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 131.56 పాయింట్లు (0.21 శాతం) నష్టపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 22,866.5 కోట్లు నష్టపోయి రూ.17,57,339.72 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ.4,757.92 కోట్లు కోల్పోయి రూ.5,83,462.25 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,706.86 కోట్లు పెరిగి రూ.6,41,898.91 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,614.89 వృద్ధి చెంది రూ. 6,70,264.99 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,403.76 కోట్ల లబ్ధితో రూ. 12,22,781.79 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 5,869.21 కోట్లు లాభ పడి రూ. 4,65,642.49 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.3,415.33 కోట్లు పెరిగి రూ.4,85,234.16 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,508.95 కోట్లు వృద్ధి చెంది రూ.8,99,489.20 కోట్ల వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.1,383.32 కోట్లు లాభంతో రూ.5,37,841.73 కోట్లకు చేరుకున్నది.
అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,271.1 కోట్ల వృద్ధితో రూ.4,58,263.35 కోట్ల వద్ద స్థిర పడింది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిలిచాయి.