బైజూస్ వ్యవస్థాపకుడికి బై
ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ను బయటకు పంపేందుకు కంపెనీ షేర్హోల్డర్లు ఓటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- రవీంద్రనాథ్ను బయటకు పంపేందుకు నేడు ఈజీఎం
ముంబై, ఫిబ్రవరి 22: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ను బయటకు పంపేందుకు కంపెనీ షేర్హోల్డర్లు ఓటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కంపెనీ యాజమాన్యమైన రవీంద్రనాథ్, ఆయన కుటుంబాన్ని తొలగించేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు డిమాండ్ చేసిన అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం)శుక్రవారం ఫిబ్రవరి 23న జరగనుంది. ఉన్నత యాజమాన్యం తొలగింపునకు ఈజీఎంలో తీర్మానాన్ని ఆమోదిస్తారు. అయితే ఈజీఎంలో ఆమోదించిన ఎటువంటి తీర్మానాన్ని అయినా తదుపరి విచారణలోగా అమలు చేయరాదని కర్నాటక హైకోర్టు ఆదేశించినందున, మార్చి 13 వరకూ ఈ తీర్మానం అమలుకాదు. ఈజీఎంపై స్టే విధించాలని బైజూస్ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులకు బైజూస్ ప్రమోటింగ్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 26.3 శాతం వాటా ఉంది. 32 శాతంపైగా వాటా ఉన్న కొన్ని ఇన్వెస్టింగ్ సంస్థలు ఈజీఎం కోసం పట్టుపట్టాయి. ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ సతీమణి చాన్ జుకర్‌బర్గ్‌తో సహా బ్లాక్‌రాక్‌తో సహా పలు అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్స్‌కు థింక్ అండ్ లెర్న్‌లో వాటాలు ఉన్నాయి.
ఆరోపణలివి..
- కంపెనీ యాజమాన్యం ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందంటూ జనరల్ అట్లాంటిక్, పీక్ ఎక్స్‌వీ, సోఫినా, చాన్ జుకర్‌బర్గ్, ఓవెల్, శాండ్స్ తదితర ఇన్వెస్టర్లు ఈజీఎం నోటీసును జారీచేశారు. నోటీసులో పేర్కొన్న ఆరోపణలివి..
- ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడంలో కంపెనీ యాజమాన్యం వైఫల్యం చెందడం
- రుణదాతలతో టెర్మ్ రుణాల్ని పరిష్కరించుకోకపోవడం
- టెర్మ్ రుణంపై షేర్హోల్డర్లను రవీంద్రన్ తప్పుదోవ పట్టించారంటూ ఆరోపణ
- క్రికెట్ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐతో వివాదం
- ఆడిట్స్ను పూర్తి చేయకపోవడం
- టీడీఎస్ ద్వారా మినహాయించిన పన్నులు, ప్రావిడెంట్ ఫండ్‌తో సహా ఇతర చట్టబద్ధ చెల్లింపుల్లో జాప్యం చేయడం
- సంస్థను వీడిన ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్తో సహా సిబ్బందికి చెల్లింపుల్ని జాప్యం చేయడం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

