హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో వెల్లడించింది.
వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి జితిన్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్శించడం, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో పారిశ్రామిక కారిడార్లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.