ED on Hero Motocorp | హవాలా లావాదేవీల కేసులో మంగళవారం టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ తదితరుల ఇండ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరిపింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ సోదాలు జరిపింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న గుర్‌గ్రామ్‌లో సోదాలు నిర్వహించారు.
2001లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థగా నిలిచిన హీరో మోటో కార్ప్స్ ప్రతియేటా గణనీయ సంఖ్యలో మోటారు సైకిళ్లు, స్కూటర్లు విక్రయిస్తూ గత రెండు దశాబ్దాలకు పైగా తన స్థానాన్ని కాపాడుకుంటున్నది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా పరిధిలోని 40 దేశాల్లో హీరో మోటో కార్ప్ బైక్స్, స్కూటర్లు తిరుగుతున్నాయి. ఇదిలా ఉంటే హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. పన్ను ఎగవేత కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇల్లు, కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం అధికారులు దాడి చేశారు.