హైదరాబాద్, నవంబర్ 20: అన్ని రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈబీజీ గ్రూపు..హైదరాబాద్‌లో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ పవర్‌హౌజ్ సెంటర్‌ను ప్రారంభించింది. 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్లో 400 మంది కూర్చోవడానికి వీలుంటుందని కంపెనీ చైర్మన్, ఫౌండర్ ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు.
వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో ఈ సెంటర్ కోసం 7 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించిన ఆయన..హైదరాబాద్ సెంటర్ కోసం 350 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు చెప్పారు.