న్యూఢిల్లీ, నవంబర్ 14 : ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.1,000 లోపు ఉత్పత్తులపై జీరో కమీషన్ మాడల్‌ను అనుసరిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ నూతన మాడల్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు హైపర్వాల్యూ ప్లాట్‌ఫామ్ షాప్సీకి కూడా వర్తించనున్నదని పేర్కొంది. ఈ నూతన పద్దతిలో రూ.1,000 లోపు ధర కలిగిన అన్ని రకాల ఉత్పత్తులపై ఎలాంటి కమీషన్ ఫీజును వసూలు చేయడం లేదని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వెయ్యి రూపాయల లోపు ధర కలిగిన వస్తువులను విక్రయించే సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నదని పేర్కొంది.
దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సకైత్ చౌదరి తెలిపారు. దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ జీరో కమీషన్ మాడల్‌ను తెరపైకి తీసుకొచ్చినట్టు, అలాగే ప్రాంతీయంగా ఎదుగుతున్న కొత్త బ్రాండ్లు డిజిటల్ ఎకానమి వైపు అడుగులు వేసే అవకాశం కూడా ఉందన్నారు. దీంతో లక్షలాది మంది కస్టమర్లకు చౌకైన ధరకు ఉత్పత్తులను అందించానికి వీలు పడనున్నది.