న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రస్తుత పండుగ సీజన్లో ఈ-కామర్స్ సంస్థల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తుల ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు.
వీటికి తోడు పలు ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 23-25 శాతం వరకు పెరిగాయి. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రావడంతో అతిపెద్ద స్క్రీన్ టీవీలు, మధ్యస్థాయి ఫ్యాషన్, ఫర్నిచర్ ప్రయోజనాలు నేరుగా కొనుగోలుదారులకు బదలాయించడంతో వీటి ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ రీసర్చ్ రెడ్సీర్ తాజాగా వెల్లడించింది.