హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ తొలిసారిగా గూడ్స్ రైలు (ఎన్ఎంజీ రేకుల) ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు రవాణా చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రవాణా ద్వారా రైల్వేకు ఏక కాలంలో రూ.17.50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు 1,770 కిలో మీటర్లు ఆటోలను రవాణా చేసినట్టు డీఆర్ఎం లోకేశ్ విష్ణోయ్ తెలిపా తెలిపారు.
తగ్గిన ఫారెక్స్ నిల్వలు
ముంబై, నవంబర్ 15: విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 8తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.477 బిలియన్ డాలర్లు తరిగిపోయి 675.653 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలోనూ నిల్వలు 2.675 బిలియన్ డాలర్లు తగ్గి 683.13 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం తెలిసిందే.