న్యూఢిల్లీ, మే 30: పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఐదు నెలలు అవకాశం కల్పించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు పత్తి దిగుమతులపై ఎలాంటి సుంకం వసూలు చేయబోరు. ఇందుకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. జూన్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధన ఏప్రిల్ 30 వరకు పత్తి దిగుమతులపై ఎలాంటి దిగుమతి సుంకాన్ని మినహాయింపునిచ్చారు. ఈ నిర్ణయంతో దేశీయ టెక్స్టైల్ రంగం ఎదుర్కొంటున్న పత్తి మరింత సులువుగా లభించనున్నదని పేర్కొన్నది. తాత్కాలిక పన్ను మినహాయింపుతో వస్త్ర, దుస్తుల రంగాల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, దేశీయ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తయారీదారులు, వినియోగదారులకు నిర్దిష్ఠ ఉపశమనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కీలక నిర్ణయం దేశీయ టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చినట్టు కానున్నదని పేర్కొంది.