ముంబై, జనవరి 13: ఇటలీకి చెందిన లగ్జరీ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ..ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి పది కొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నది. వీటిలో కొత్త మాడళ్లతోపాటు అప్డేటెడ్ మాడళ్లు కూడా ఉన్నాయని కంపెనీ ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు.
ఈ పది మాడళ్లలో ఇప్పటికే రెండు మోటర్ సైకిళ్లను ఈ నెల మొదట్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకులకోసం షోరూంలలో బుకింగ్ చేసుకోవచ్చునని ఆయన సూచించారు.