Sheikha Mahra | దుబాయి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె ప్రిన్సెస్ షేఖా మహరా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె భర్త షేక్ మనా బిన్ మహ్మద్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మహరా కొత్త ఫెర్ఫ్యూమ్ని విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫెర్ఫ్యూమ్కి ‘డివోర్స్’ పేరు పెట్టడం విశేషం. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫెర్ఫ్యూమ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. బ్లాక్ కలర్లో నల్లటి బాటిల్, పగిలిన గాజు, నల్లటి రేకులు, నల్లటి చిరుత పులి టీజర్లో కనిపించాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ‘డివోర్స్’ పెర్ఫ్యూమ్ పోస్టర్ని పంచుకున్నారు.
‘డివోర్స్ బై మహర్ M1’ అని పోస్ట్ చేశారు. షేఖా జూలైలో తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. సమయంలో భర్తను సోషల్ మీడియాలో ఆన్‌ఫాలో చేసింది. భర్తతో ఉన్న ఫొటోలను తొలగించింది. రషీద్, షేఖా మహరా జంటకు ఓ బిడ్డకు కూడా ఉన్నది. షేఖా మహరా ఫిబ్రవరి 26, 1994లో యూఏఈలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు. షేఖా మహారా ఎమిరాటీ, గ్రీకు మూలాలున్నాయి. ఆమె తల్లి జో గ్రిగోరాకోస్ గ్రీస్‌కు చెందినవారు. దుబాయిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత లండన్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. యూకే విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిగ్రీని పొందారు.
మొహమ్మద్ బిన్ రషీద్ ప్రభుత్వ పరిపాలన నుంచి కళాశాల డిగ్రీని సైతం తీసుకున్నారు. మహ్రా మే 2023లో షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు షేఖా మహరా బింట్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ అని పేరు పెట్టారు. అయితే, జూలైలో షేఖా మహరా విడాకులు బహిరంగంగా ప్రకటించింది. షేక్ మనా మరో మహిళతో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. షేక్ మనా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ తనయుడు. జీసీఐ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ, ఎంఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దుబాయ్ టెక్ అండ్ అల్బరాదా ట్రేడింగ్‌తో సహా యూఏఈలో అనేక విజయవంతమైన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. షేక్ మనా ఆస్తుల విలువ 1.5 బిలియన్లుగా అంచనా.