హైదరాబాద్, జూన్ 15: దేశీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. భారత సైన్యానికి తొలి విడుతగా 41 జేకే 250ఈ డ్రోన్లను డ్రోగో ఏరోస్పేస్ అందచేసింది. సైన్యం నుంచి లభించిన మొ త్తం రూ.72 కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగా వీటిని అందచేసినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు. మిగతా డ్రోన్లను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరోవైపు, దేశీయంగా డ్రోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో లక్ష అడుగుల విస్తీర్ణంలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఆర్థిక వివరాలు వెల్లడించకపోయినప్పటికీ ఈ యూనిట్‌తో 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.