హైదరాబాద్, డిసెంబర్ 13: టెక్నాలజీ ఆధారంగా నీటిని శుద్ది చేసి కొనుగోలుదారులకు అందిస్తున్న డ్రింక్‌ప్రైమ్ తాజాగా హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను ప్రారంభించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ప్రజలకు స్వచ్ఛమైన, శుభ్రమైన తాగునీరును అందించడానికి ఈ కొత్త యూనిట్‌ను నెలకొల్పినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో విజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సంస్థ 2016లో టీ-హబ్ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే.