న్యూఢిల్లీ, జూన్ 12: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అమెరికాకు చెందిన ఇంజెస్ ఫార్మాస్యూటికల్స్‌తో జట్టుకట్టింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకోసం వాడే సైక్లోఫాస్పమైడ్ ఇంజెక్షన్‌ను అక్కడి మార్కెట్లో విక్రయించడానికి సంస్థతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
500 ఎంజీ/2.5 ఎంఎల్, 1గ్రాము/5 ఎంఎల్, 2గ్రాము/10 ఎంఎల్ రకాల్లో అమెరికా మార్కెట్లో ఈ ఔషధం లభించనున్నది. మార్చితో ముగిసిన ఏడాదికాలంలో ఈ ఔషధ విక్రయాలు 51.8 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.