న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)ను.. టెన్నిస్ ప్రేక్షకులు ఆట పట్టించారు. న్యూయార్క్‌లోని ఆర్తే ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ ఫైనల్‌ను ట్రంప్ వీక్షించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రేక్షకులు అల్లరల్లరి చేశారు. స్టేడియంలోని మెగా స్క్రీన్‌పై ట్రంప్ కనిపించగానే, ప్రేక్షకులు కూని రాగాలు తీస్తూ అధ్యక్షుడిని వేధించారు. అయితే ట్రంప్ మాత్రం మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్ చాంపియన్‌గా నిలిచారు. అతను ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
వాస్తవానికి జానిక్ సిన్నర్‌తో జరిగిన ఫైనల్‌ను ఓ అరగంట ఆలస్యంగా స్టార్ట్ చేశారు. దీని పట్ల టెన్నిస్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఎటువంటి హెచ్చరిక చేయకుండానే మ్యాచ్‌ను ఆలస్యంగా మొదలుపెట్టారు. అయితే ట్రంప్ స్టేడియంలోకి వస్తున్న కారణంగా.. నిర్ణీత సమయం కన్నా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్టేడియంలో భద్రతను చూసుకున్నారు. ట్రంప్ రాక వల్ల ఆ ఏర్పాట్లు ఆలస్యం అయ్యాయి. దీని వల్ల మ్యాచ్‌ను అరగంట ఆలస్యంగా మొదలుపెట్టడం జరిగినట్లు సీక్రెస్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు. అనేక మంది సెలబ్రిటీలు కూడా ఇబ్బందిపడ్డారు.
స్టేడియంలో ట్రంప్ బృందం ఉన్న బాక్సు వద్ద హంగామా జరిగింది. దేశాధ్యక్షుడిని తిలకించేందుకు టెన్నిస్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. బాక్సు వద్దకు వచ్చిన వారికి థమ్స్ అప్ ఇస్తూ, సంకేతాలు చేస్తూ ట్రంప్ వారిలో హుషారు నింపారు. ట్రంప్ రకరకాల హావభావాలు చేస్తున్న సమయంలో ప్రేక్షకులు చీర్స్, కేరింతలు కొట్టారు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించాడు అల్కరాజ్. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపనలో ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన క్యాప్‌ను విసిరేశారు ట్రంప్.
Make tennis great again! Trump hurls signed caps, steals show at US Open pic.twitter.com/IEiFWWuWJJ
— Viory Video (@vioryvideo) September 8, 2025