ముంబై, జూన్ 30: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు బ్యాంకింగ్ రంగ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూ చీల పతనానికి ఆజ్యంపోశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు వచ్చినప్పటికీ దేశీయ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 500 పా యింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 84 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 452.44 పాయింట్లు నష్టపోయి 83,606.46 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ సైతం 120.75 పాయింట్లు కోల్పోయి 25,517.05 వద్ద స్థిరపడింది.