ముంబై: ముంబైలో దారుణమైన మర్డర్(Mumbai Murder) జరిగింది. 19 ఏళ్ల అమ్మాయిని పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్చి చంపారు. శివాజీ నగర్లో ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిని షిఫా షేక్‌గా పేర్కొన్నారు. శివాజీ నగర్‌లోని ఫుర్కియానా మసీదు వద్ద ఘటన జరిగింది. 12 గంటల్లోనే ఆ అమ్మాయిని మర్డర్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. 25 ఏళ్ల మహిళతో పాటు 23 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ట్రయాంగిల్ లవ్‌గా పోలీసులు భావిస్తున్నారు.
ఓ మహిళ ఫోన్ చేయడంతో మసీదు వద్దకు బాధితురాలు షిఫా వెళ్లింది. ఓ అంశంలో షిఫా, మరో మహిళ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి. షిఫాను పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె చెంప నుంచి పుర్రెలోకి బుల్లెట్ వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఘాట్కోపర్లోని రాజావాది ఆస్పత్రికి తరలించారు. చాలా దగ్గర నుంచి కాల్చడం వల్ల తీవ్ర గాయాలతో షిఫా మరణించినట్లు పోలీసులు చెప్పారు.
ఘటన ప్రదేశం నుంచి సేకరించిన ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.