ముంబై, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. బ్యాంకింగ్, ఆర్థిక, పవర్ రంగ సూచీలు ఇచ్చిన దన్నుతో సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోష్లో దూసుకుపోయాయయి. ఇంట్రాడేలో 699.61 పాయింట్లు ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 454.11 పాయింట్ల లాభంతో 77,073.44 పాయింట్లకు చేరుకున్నది. మరోసూచీ నిఫ్టీ 141.55 పాయింట్లు అందుకొని 23,344.75 పాయింట్ల వద్ద స్థిరపడింది.