ముంబై, ఏప్రిల్ 1: నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఒక దశలో 1,500 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 1,390 పాయింట్లు (1.80 శాతం)కోల్పోయి 76,024.51 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 353.65 పాయింట్లు (1.50 శాతం) పడి 23,165.70 వద్ద నిలిచింది. దీంతో మదపరులు రూ.3.44 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈ కంపెనీల విలువ రూ.3,44,058.44 కోట్లు కరిగిరూ.4,09, 43,588.06 కోట్లకు పడిపోయింది.