ముంబై, ఆగస్టు 28: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. వరుసగా రెండు రోజులుగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు లాభాల వైపు నడిపించాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 330.92 పాయింట్లు అందుకొని 77,264.51 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 84.80 పాయింట్లు అందుకొని 24,175.65 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ, టైటాన్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు మాత్రం నష్టపోయాయి.