Car Sales | ఫాస్ట్‌లేన్‌లో మే కార్ల సేల్స్.. ఎస్యూవీలపైనే అందరి మోజు..!
Car Sales | దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్‌లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్‌యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
Car Sales | దేశీయంగా మే నెలలో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. సెమీ కండక్టర్ల సరఫరా మెరుగు పడటంతో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు గిరాకీ పెరిగింది. 2022 మే తో పోలిస్తే గత నెలలో కార్ల సేల్స్ 13.49 శాతం పెరిగాయి. 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో కార్ల విక్రయంలో గరిష్టం. మొత్తం కార్ల సేల్స్‌లో 47 శాతం ఎస్‌యూవీలదే.
2022 మే నెలలో దేశీయ మార్కెట్లో 2,94,997 కార్లు అమ్ముడయ్యాయి. 2018 మే నెలలో 3,01,238 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సేల్స్ గతేడాది మేతో పోలిస్తే గత నెలలో 15.45 శాతం పెరిగాయి. మొత్తం కార్ల విక్రయాల్లో 43 శాతం మారుతిదే. గత నెలలో 1,43,708 మారుతి సుజుకి కార్లు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్లలో క్రెటా, వెన్యూ, వెర్నా మోడల్ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మూడు మోడల్ కార్లతో మొత్తం 48,601 కార్లు విక్రయించింది. 2022 మేతో పోలిస్తే 14.91 శాతం గ్రోత్ నమోదైంది.
పంచ్, నెక్సాన్ వంటి ఎస్యూవీ వేరియంట్ కార్లకు గల డిమాండ్‌తో టాటా మోటార్స్ కార్ల విక్రయాలు 5.85 శాతం పెరిగాయి. మొత్తం 45,878 కార్లు విక్రయించింది. స్కార్పియో-ఎన్, ఎక్స్ యూవీ 700, థార్ వంటి ఎస్యూవీ కార్లకు గిరాకీతో మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 22.23 శాతం పెరిగాయి. గతేడాది మేతో పోలిస్తే గత నెలలో 32,886 కార్ల సేల్స్ జరిగాయి.
మరో కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల సేల్స్ దేశీయంగా 89.96 శాతం పెరిగి 19,379 యూనిట్లకు చేరాయి. సొనెట్ 8,251, సెల్టోస్ 4065, కరెన్స్ 6,367 యూనిట్లతో కలిపి కియా మోటార్స్ సేల్స్ 18,766 యూనిట్లకు చేరాయి. ఇక అమేజ్, సిటీ మోడల్ కార్లతో కలిపి హోండా కార్ల సేల్స్ 4,660 యూనిట్లకే పరిమితమైంది. గతేడాదితో పోలిస్తే 43.09 శాతం సేల్స్ పడిపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

