Gold Price | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.73,500కి దిగింది. అంతకుముందు ధర రూ.74, 200గా ఉన్నది. వెండి ధర కిలో రూ.2,000 తగ్గి రూ.83,800కి దిగొచ్చినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,522.90 డాలర్లు, వెండి 28.44 డాలర్ల వద్ద ఉన్నాయి.
20 లక్షల కోట్లు దాటిన ఆటో ఇండస్ట్రీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశీయ ఆటోమొబైల్ రంగం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీ రూ.20 లక్షల కోటు దాటిందని, మొత్తం జీఎస్టీ వసూళ్లలో 14-15 శాతం వాటా ఈ రంగానిదేనని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు.