Domestic Aeroplances | మీరు విమానంలో హైదరాబాద్ నుంచి కోల్కతా.. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే, దేశీయంగా వివిధ ప్రాంతాల మధ్య విమాన ప్రయాణానికి 15 రోజుల ముందు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు 30 రోజుల ముందు బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతం దేశంలో విమానాలు.. 85 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయి. ఇంతకుముందు అది 72.5 శాతంగా ఉంది. ఈ మేరకు ఎయిర్లైన్స్ సంస్థలు టిక్కెట్లను విక్రయించడానికి కేంద్ర విమానయానశాఖ శనివారం అనుమతి ఇచ్చింది.
వచ్చేనెలాఖరు నాటికి శీతాకాల షెడ్యూల్ వస్తుంది. వ్యాక్సినేషన్ వేగం పుంజుకోవడంతో ఇప్పటికి కోవిడ్-19 నియంత్రణలోకి వచ్చిందని విమానయాన రంగ పరిశ్రమ భావిస్తున్నది. డిమాండ్, సప్లయిని బట్టి టికెట్ల ధరలు ఉంటాయి.
ఒక వ్యక్తి అక్టోబర్ ఒకటో తేదీన విమాన ప్రయాణ టికెట్ బుక్ చేసుకున్నాడనుకుందాం.. బుకింగ్ చేసిన తేదీ తర్వాత 15 రోజులకు అంటే అక్టోబర్ 15 తర్వాత ప్రయాణించొచ్చు. 15 రోజుల గడువు ముందు బుకింగ్ చేసే టిక్కెట్ ధర నిర్దేశిత కనీస మొత్తం కంటే తక్కువగా ఉండొచ్చు. కొన్నిసార్లు గరిష్ఠంగానూ ఉండొచ్చు.