శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Aug 08, 2020 , 02:31:01

మహీంద్రా లాభంలో భారీ క్షీణత

మహీంద్రా లాభంలో భారీ క్షీణత

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాలకు కరోనా వైరస్‌ గండికొట్టింది. ఈ వైరస్‌ దెబ్బకు గత త్రైమాసిక లాభం రూ.54.64 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.894.11 కోట్ల లాభంతో పోలిస్తే 94 శాతం పడిపోయినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అటు ఆదాయంలోను ఏడాది ప్రాతిపదికన 37 శాతం తగ్గి రూ.16,321. 34 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. గతేడాది ఇది రూ.26,041. 02 కోట్లుగా ఉన్నది. దీంట్లో ఆటోమోటివ్‌ విభాగం నుంచి రూ. 6,508 కోట్లు మాత్రమే సమకూరగా, అదే వ్యవసాయ ఉత్పత్తుల సెగ్మెంట్‌ నుంచి రూ.4,906. 92 కోట్లు, ఆర్థిక సేవలు అందించడం ద్వారా రూ.3,031.69 కోట్లు లభించాయి. ఆతిథ్య రంగం నుంచి రూ. 294 కోట్లు సమకూరాయి. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వృద్ధిని సాధిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.