Smart watches : ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయంలో ఈ స్మార్ట్ వాచ్‌లను చౌక ధరల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం వెయ్యి రూపాయల లోపు ధరలో పలు స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెయ్యి రూపాయలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో బీట్ ఎక్స్పీ మార్వ్ నియో స్మార్ట్ వాచ్ ఒకటి. ఈ వాచ్‌లో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా హార్ట్ మానిటరింగ్‌తోపాటు మరెన్నో ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్‌ను ఇచ్చారు. ఈ వాచ్ ధర రూ.999గా నిర్ణయించారు.
వెయ్యి రూపాయల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో బోట్ ఎక్స్టెండ్ వాచ్ ఒకటి. అమెజాన్‌లో ఈ వాచ్ రూ. 999కి అందుబాటలో ఉంది. ఈ వాచ్‌లో 1.69 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇందులో స్లీప్ మానిటర్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ ఒకటి. ఈ వాచ్ అమెజాన్‌లో రూ. 999కి అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన డిస్ప్లేను అందించారు. ఇక ఈ వాచ్‌లో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి.
తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్ నాయిస్ వివిడ్ కాల్ 2 ఒకటి. ఈ వాచ్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన హెడ్డీ డిస్ప్లే స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో ఈ వాచ్ పనిచేస్తుంది. అలాగే ఇందులో IP68 వాటర్‌ప్రూఫ్, ఏడో రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్ అమెజాన్‌లో రూ.999కి అందుబాటులో ఉంది.
టాగ్ వెర్వ్ నియో స్మార్ట్ వాచ్ ధర రూ.719కి అందుబాటులో ఉంది. ఈ వాచ్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.69 ఇంచెస్‌తో కూడిన డిస్ప్లేను అందించారు. అలాగే ఇందులో 60 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులపాటు పనిచేస్తుంది.