NPS | ఎన్‌పీఎస్‌లో వార్షిక పెట్టుబడి ప్రయోజనాలు తెలుసా? నెలకు రూ.74 వేల పెన్షన్ రావాలంటే ఏం చేయాలి?
వయసులో ఉన్నప్పుడు శ్రమ ఎంత అవసరమో.. ఆ వయసు మీరిన తర్వాత విశ్రాంతీ అంతే అవసరం. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవారికే ఆ విశ్రాంతి పరిపూర్ణంగా దక్కుతుంది. రోజూ మనం ఎంతోమంది సీనియర్ సిటిజన్లు పనిచేస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం.
నేడు ప్రతి ఒక్కరూ యాంత్రిక జీవనంలో పడి నలిగిపోతున్నారు.
మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఓవైపు బాధ్యతలు.. మరోవైపు లక్ష్యాలతో నిత్యం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
ఇలాంటి వారందరికీ రిటైర్మెంట్ గొప్ప ఊరటే. అయితే సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుంటేనే పదవీ విరమణ కాలం ఓ స్వర్ణ యుగం. లేకపోతే విశ్రాంతి జీవితంలోనూ చెమటోడ్చాల్సిన దుస్థితి తప్పదు. అందుకే పనిచేసే వయసులోనే రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరం.
NPS | వయసులో ఉన్నప్పుడు శ్రమ ఎంత అవసరమో.. ఆ వయసు మీరిన తర్వాత విశ్రాంతీ అంతే అవసరం. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవారికే ఆ విశ్రాంతి పరిపూర్ణంగా దక్కుతుంది. రోజూ మనం ఎంతోమంది సీనియర్ సిటిజన్లు పనిచేస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకే కెరియర్ ఆరంభంలోనే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ కాలం గురించి తప్పక ఆలోచించాలి. అప్పుడే ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో పదవీ విరమణానంతరం ఆకర్షణీయమైన ఆదాయం పెన్షన్ రూపంలో అందుకోవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్
మలి వయసు అవసరాల కోసం యువ మదుపరులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఓ చక్కని అవకాశమనే చెప్పాలి. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి ఇదో ప్రభావవంతమైన వేదిక. పన్ను ప్రయోజనాలూ ఉండటంతో పెట్టుబడిదారులకు అదనపు లాభం. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద వర్తించే రూ.1.5 లక్షల పన్ను మినహాయింపుతోపాటు సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద అదనంగా మరో రూ.50,000 పన్ను కోతల్ని అందుకోవచ్చు.
ఏటా రూ.50 వేలతో..
ఎన్‌పీఎస్‌లో ఏటా రూ.50,000 పెట్టుబడిగా పెడితే.. 60 ఏండ్లు దాటాక గరిష్ఠంగా నెలకు దాదాపు రూ.74,000 పెన్షన్‌గా అందుకునే వీలున్నది. అయితే 100 శాతం యాన్యుటీ ప్లాన్‌తోనే ఈ సదుపాయం ఉంటుంది. అంటే మీరు పెట్టిన వార్షిక పెట్టుబడులతో మీ 60వ ఏట జమయ్యే కార్పస్ నుంచి లంప్సమ్ మొత్తాన్ని తీసుకోకూడదన్నమాట. ఇక ఒకవేళ మీ యాన్యుటీ 100 శాతానికి దిగువన ఉంటే ఆ మేరకు మీ నెలసరి పెన్షన్ కూడా తగ్గుతుంది. అలాగే కనీస యాన్యుటీ 40 శాతం. అంటే ఇన్నాళ్లూ మీరు పెట్టిన పెట్టుబడితో సమకూరే కార్పస్‌లో 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్ కొనుగోలుకు తప్పక వినియోగించాల్సిందే. మిగతా 60 శాతం నిధిని ఒకేసారి (లంప్సమ్) తీసుకోవచ్చు. దీనికి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపుంటుంది.
30 ఏండ్ల వ్యక్తి..
మీ వయసు 30 ఏండ్లుగా ఉన్నప్పుడు ఏటా రూ.50,000 చొప్పున తర్వాతి 30 ఏండ్లు పెట్టుబడిగా పెడుతూపోతే మీకు 60 ఏండ్లు వచ్చినప్పుడు ఆ పెట్టుబడి రూ.15 లక్షలు అవుతుంది. అప్పుడు దీని కార్పస్ రూ.1.10 కోట్లుగా ఉంటుంది. ఈ సమయంలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం ఈ కార్పస్‌తో 100 శాతం యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవడం, లేదా కొంత మొత్తాన్ని లంప్సమ్గా తీసుకుని, మిగిలిన నిధితో యాన్యుటీ ప్లాన్‌ను కొనుక్కోవడం. ఒకవేళ మీరు 100 శాతం యాన్యుటీ ప్లాన్ తీసుకున్నైట్టెతే నెలసరి పెన్షన్ రూ.73,638 పొందవచ్చు. 40 శాతం యాన్యుటీ ప్లాన్ కొన్నైట్టెతే నెలనెలా రూ.29,455 పెన్షన్ అందుకోవచ్చు. మరో రూ.66.27 లక్షలు లంప్సమ్గా తీసుకోవచ్చు.
40 ఏండ్ల వ్యక్తి..
మీ వయసు 40 ఏండ్లుగా ఉన్నప్పుడు ఏటా రూ.50,000 చొప్పున తర్వాతి 20 ఏండ్లు పెట్టుబడిగా పెడుతూపోతే మీకు 60 ఏండ్లు వచ్చినప్పుడు ఆ పెట్టుబడి రూ.10 లక్షలు అవుతుంది. అప్పుడు దీని కార్పస్ రూ.35.63 లక్షలుగా ఉంటుంది. మొత్తం ఈ కార్పస్‌తో 100 శాతం యాన్యుటీ ప్లాన్‌ను తీసుకుంటే రూ.23,755 నెలసరి పెన్షన్ పొందవచ్చు. 40 శాతం యాన్యుటీ ప్లాన్‌తో నెలనెలా రూ.9,502 పెన్షన్‌గా అందుకోవచ్చు. మరో రూ.21.37 లక్షలు లంప్సమ్ అమౌంట్‌గా అందుకోవచ్చు.
చివరగా..
కేవలం 10 ఏండ్లు ముందుగా ఎన్‌పీఎస్‌లో చేరినైట్టెతే మీకు అందే పెన్షన మొత్తాలు ఎంత ఎక్కువగా ఉంటాయో ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా చక్రవడ్డీ ప్రయోజనం. కనుక పెట్టుబడులు ఎప్పుడైనా చిన్న వయసు నుంచే మొదలు పెడితే పెద్ద ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు. కాగా, యాన్యుటీ ప్లాన్‌లో అందుకునే లంప్సమ్ అమౌంట్ ఉపసంహరణను పదేండ్లపాటు వాయి దా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు 60 ఏండ్లు రాకముందే ఈ స్కీం నుంచి వైదొలిగితే.. కార్పస్‌లో 20 శాతం మాత్రమే లంప్సమ్గా అందుతుంది. మిగతా 80 శాతం నిధితో యాన్యుటీ ప్లాన్ కొనాలి. పెన్షన్‌దారుడు చనిపోతే నామినీ లేదా వారసులకు నగదు, స్కీం ప్రయోజనాలు అందుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

