NACH Services|నాచ్ సేవలు! ఇక ఏ రోజైనా శాలరీ.. పెన్షన్..!!
NACH Services|నాచ్ సేవలు! ఇక ఏ రోజైనా శాలరీ.. పెన్షన్..!! వేతనం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీల కోసం వర్కింగ్ డే కోసం ....

ముంబై: మీరు వేతనం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీల కోసం వర్కింగ్ డే కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) నిబంధనలను మార్చేసింది. సవరించిన ఈ నిబంధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
నాచ్ అమల్లోకి వస్తే వారమంతా లావాదేవీలు
తాజా నాచ్ నిబంధనలు అమలులోకి వస్తే మీ వేతనం లేదా పెన్షన్ కోసం వర్కింగ్ డే కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి వారమంతా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు నాచ్ నిబంధనలు బ్యాంకులు పని చేసిన రోజుల్లో మాత్రమే (సోమ నుంచి శుక్రవారం వరకు) అమలులో ఉండేవి.
గత నెల ద్రవ్య సమీక్షలో..
కొన్ని సందర్భాల్లో ఒకటో తేదీ వారాంతమైతే.. ప్రజలు తమ లావాదేవీలను చేపట్టడానికి బ్యాంకు వర్కింగ్ డే కోసం సోమవారం వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ గత నెలలో ద్రవ్య పరపతి సమీక్షలో దీన్ని చర్చించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

24 గంటలూ ఇక నాచ్ సేవలు
తద్వారా నాచ్ సేవలను 24 గంటలూ అందుబాటులోకి తెచ్చారు శక్తికాంత దాస్. దీంతో 24 గంటల పాటు రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నాచ్ (ప్రస్తుతం బ్యాంకులు పని చేసే రోజుల్లో) అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఎన్పీసీఐ ఆధ్వర్యంలో నిర్వహణ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బల్క్ పేమెంట్ సిస్టం.. నాచ్. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్ వంటి చెల్లింపుల లావాదేవీలు దీనితో చేయొచ్చు. దీంతోపాటు విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, వాటర్, నెలసరి రుణ వాయిదా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు కూడా చేపట్టొచ్చు.
ఇక నుంచి మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకింగ్ లావాదేవీల కోసం వేచి చూడనక్కర్లేదు. వారాంతంలో కూడా అంటే ఆరు రోజులూ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుకోవచ్చు.
లబ్ధిదారులకు సక్సెస్ఫుల్ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) డిజిటల్ మోడ్‌గా నాచ్ ఆవిర్భవించింది. అత్యంత ప్రజాదరణ, ప్రాముఖ్యమోడ్గా నిలిచింది. కరోనా మహమ్మారి వేళ ప్రభుత్వ సబ్సిడీలను లబ్దిదారులకు సకాలంలో, పారదర్శకతతో పంపిణి చేసేందుకు నాచ్ వెసులుబాటు కల్పించింది.
ఇవి కూడా చదవండి:
Infosys ‘WFH’ Ends| వర్క్ ఫ్రం హోంకు ఇన్ఫోసిస్ స్వస్తి.. ఎందుకంటే?!
రెండో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
Tokyo Olympics: ఆ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచే ఆ ఐదు రింగులు
ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం.. టీమిండియా రికార్డు
Tokyo Olympics: ఓపెనింగ్ సెర్మనీ పరేడ్‌లో పాల్గొన్న ఇండియన్ అథ్లెట్లు
యాక్షన్ గేమ్స్ పక్కనపెట్టండి.. గూగుల్ డూడుల్‌తో ఒలింపిక్ గేమ్స్ ఆడతారా?
Tokyo Olympics : ఈ ఏడుగురు వనితల్లో స్వర్ణం తెచ్చేదెవరో
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌కు షాక్.. సీసీఐ విచారణను అడ్డుకోలేం.. కర్ణాటక హైకోర్టు
యడియూరప్పను తొలగించేందుకు బీజేపీ హైకమాండ్ కుట్ర!
దాంపత్య రహస్యాలు లీక్ చేసేది వాళ్ళే….
నిర్మల్‌లో నడి రోడ్డుపై చేపల కోసం జనం పరుగులు.. వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

