Banks Diwali Offers | పండుగలు వచ్చాయంటే ఇంటిల్లిపాదిలో కొత్త ఆనందం.. ప్రతి కుటుంబం కొత్త వస్తువు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. వీలైతే దీర్ఘ కాలిక పెట్టుబడి.. అంటే సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతూ ఉంటుంది. అంతా డిజిటల్ మయమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-కామర్స్ సంస్థల్లో వస్తువుల కొనుగోళ్లు, మొబైల్ ఫోన్లు, ఆటోమొబైల్స్ అంటే కార్లూ బైక్స్ కొనుగోళ్లు సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకులు ఆఫర్లు, డిస్కౌంట్లు, రాయితీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం బతుకమ్మ నవరాత్రి-విజయ దశమి వేడుకలు ముగిశాయి. త్వరలో దీపావళి.. క్రిస్మస్.. నూతన సంవత్సరం.. సంక్రాంతి వరకూ పండుగల సీజనే. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకులు అందించే ఆఫర్లు, రాయితీలపై ఓ లుక్కేద్దాం..
దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ SBI).. కార్లు మొదలు బంగారం కొనుగోలు, కుటుంబ అవసరాలకు స్పెషల్ ఆఫర్లు ఇస్తోంది. ప్రత్యేకించి కార్ల కొనుగోలు మొదలు బంగారం కొనుగోలు వరకు, పర్సనల్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. యోనో ( YONO ) యాప్ ద్వారా అప్లయ్ చేయొచ్చు. పూర్తి వివరాల కోసం ఎస్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించండంటూ బ్యాంక్ ట్వీట్ చేసింది. అంతే కాదు.. ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆన్లైన్లో మొబైల్ ఫోన్లు, తదితర వస్తువుల కొనుగోళ్లు చేస్తే.. అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి.
సంప్రదాయ దస్తుల కొనుగోళ్లపై 5-10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.2,500 నుంచి రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ రెడీగా ఉంది. ప్రత్యేకించి హీరో మోటో కార్ప్ నుంచి తొమ్మిది నెలల ఈఎంఐతో వెహికల్ లోన్ తీసుకుంటే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోళ్లపై 22.5 శాతం, 15 శాతం, 12 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. వివో, ఒప్పో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై రూ.8000 ఆఫర్‌తోపాటు 10 శాతం క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ కూడా ఉంది. ఎస్బీఐ కార్డుపై బంధు మిత్రులకు ఈ-ఓచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లు ఉన్నాయి.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పండుగల సీజన్ ఆఫర్లలో భాగంగా ఇండ్ల రుణాలు, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజ్ మాఫీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తున్న ఫెస్టివ్ బొనంజాతో పండుగ చేసుకోండంటూ పేర్కొంది.
ఇంకొక ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కార్లు.. ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేసింది. 7.75 శాతం వడ్డీపై ఇండ్ల రుణం, 7.90 శాతంపై కారు రుణం, ఇతర పథకాలపై వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా బుక్ మై షో, స్విగ్గీ, జొమాటోలకు చేసే ఆర్డర్లపై కస్టమర్లకు అదనపు బెనిఫిట్లు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఇక ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడే వారికి శుభవార్త. ఈ-కామర్స్ సంస్థల్లో ఆన్లైన్ వేదికగా జరిపే కొనుగోళ్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మొబైల్ ఫోన్లు, లగ్జరీ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా ఫెస్టివ్ బొనంజా కింద బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్ లెస్ ఈఎంఐలపై రూ.25 వేల వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందజేస్తున్నది.
అపారెల్ అండ్ జ్యువెల్లరీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌తోపాటు 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జొమాటో, స్విగ్గీ, ఈజీడైనర్ వంటి యాప్స్‌లో ఆర్డర్లపై 20 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వాడకంపై ఈఎంఐ ఫెసిలిటీ కూడా కల్పించింది. ఐ-ఫోన్-14పై నెలవారీ ఈఎంఐ రూ.2497 నుంచి మొదలవుతుంది. ఎంఐ, వన్‌ప్లస్, రియల్ మీ, ఒప్పో, వివో వంటి మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి.