హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని డబుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్‌ను ఉచితంగా అందించడంతోపాటు రూ.12 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్, రూ.5,999 వరకు విలువ కలిగిన ఖచ్చితమైన బహుమతి, ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బిగ్”సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. ఈ ఆఫర్లతోపాటు విపో, ఒప్పో, ఎంఐ, రియల్మీ మొబై ళ్లు కొనుగోలుపై లక్కీడ్రాలో కార్లు, బైకులు, మొబైళ్లు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఈ దీపావళి ఆఫర్లతోపాటు బైబ్యాక్ ఆఫర్, జోడి ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్, బ్రాండెడ్ యాక్సససీరిస్పై 51 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నది. అలాగే ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఏసీలను కొనుగోలు చేయవచ్చును.