హైదరాబాద్, ఫిబ్రవరి 11: దివీస్ ల్యాబ్ లాభాలకు కోవిడ్ ఔషధాలు దన్నుగా నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.902 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.471 కోట్లతో పోలిస్తే ఇది 92 శాతం అధికం. కొవిడ్-19 నియంత్రించే మోల్న్పిరవిర్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతోపాటు ముడి సరుకుల ధరలు తగ్గడం కంపెనీకి కలిసొచ్చింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.2,493 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2020-21లో వచ్చిన రూ.1,701 కోట్ల ఆదాయం కంటే ఇది 47 శాతం అధికం.