ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటామోటార్స్ తన కస్టమర్లను ఆకర్షించడానికి పలు రకాల మోడల్ కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. టాటా హరియర్ మోడల్‌పై గరిష్ఠంగా రూ. 65వేల వరకు రాయతీ లభిస్తుంది. టియాగో, టిగోర్, నెక్సాన్, ఐదు సీట్ల హ్యారియర్ మోడల్ కార్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.ఆల్ట్రోజ్తోపాటు ఇటీవల విపణిలో ఆవిష్కరించిన సఫారీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) పై మాత్రం టాటా మోటార్స్ డిస్కౌంట్లు ప్రకటించలేదు. కన్జ్యూమర్ స్కీమ్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తున్నది.
టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గించివేసింది. వీటిల్లో కన్జ్యూమర్ స్కీమ్ రూ.15వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.10 వేలు ఉన్నాయి. ఇక టిగోర్ సెడాన్‌పై కన్జ్యూమర్ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్లో రూ.15 వేలు డిస్కౌంట్ రూపంలో కలిపి మొత్తం రూ.30 వేల రాయితీ ఇస్తున్నారు. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్‌గా లభిస్తున్నది. ఇదే కారు డీజిల్ వెర్షన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ మాత్రమే లభిస్తుంది. కానీ నెక్సాన్ ఈవీ మోడల్‌కు మాత్రం ఎటువంటి డిస్కౌంట్లు ఇవ్వలేదు.
హారియర్ ఐదు సీట్ల మోడల్ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు అందిస్తున్నది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. కాకపోతే హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్లు వర్తిస్తాయని, కొన్నిటికి వర్తించవని టాటా మోటార్స్ తెలిపింది. హారియర్ డార్క్ ఎడిషన్, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్జడ్ఏ ప్లస్ మోడల్ కార్లకు ఎక్స్చేంజ్ బెనిఫిట్ కింద రూ.40 వేల రాయితీ అందిస్తున్నది.