Maruti Offers | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెలెక్టెడ్ డీలర్ షోరూమ్‌ల్లో వివిధ మోడల్ కార్ల కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లతోపాటు ఎరీనా, నెక్సా షోరూమ్‌ల్లో కాంప్లిమెంటరీ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు లభిస్తాయి.
మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో, ఆల్టో కే 10 మోడల్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 30,000, ఎక్స్చేంజ్ బోనస్ ద్వారా రూ. 15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 చొప్పున అందిస్తున్నది. ఇక సెలెరియో మోడల్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు లభ్యం అవుతుంది.
వ్యాగన్ ఆర్ మోడల్ కారుపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది మారుతి సుజుకి. స్విఫ్ట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు పొందొచ్చు.
ఆల్టో 800పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ. 15,000 చొప్పున అందిస్తున్నారు. అదనంగా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకూ లభిస్తుంది. మరో పాపులర్ మోడల్ కారు డిజైర్ కొనుగోలుదారులకు రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వరకు అందుబాటులో ఉంది. ఇక ఎవో మోడల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ బోనస్ రూ. 5,000 వరకు లభిస్తాయి. ఎర్టిగా, బ్రెజా కార్లపై డిస్కౌంట్లు ఇవ్వడం లేదు.
ఇగ్నిస్‌పై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 23,000 వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 లభిస్తుంది. సియాజ్పై క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 పొందొచ్చు.
గ్రాండ్ విటారాపై రూ.39 వేల వరకు కాంప్లిమెంటరీ యాక్సెస్, లక్ష కిలోమీటర్లు లేదా ఐదేండ్ల వరకు వారంటీ పొడిగింపు కల్పిస్తున్నది. బాలెనోలో ఎంపిక చేసిన వేరియంట్లపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10,000 లభిస్తుంది. ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా వంటి స్మార్ట్ హైబ్రీడ్ వేరియంట్లపై డిస్కౌంట్లు లేవు.