Post Office | న్యూఢిల్లీ, జూన్ 27: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలుపడనున్నది. ఆగస్టు నుంచి ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్న పోస్టాఫీస్.. ఇందుకోసం ప్రత్యేక ఐటీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. పోస్టాఫీసు ఖాతాలు యుపీఐ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడంతో అవి డిజిటల్ చెల్లింపులను అంగీకరించలేకపోతున్నాయి. నూతన అప్లికేషన్‌తో కొత్త ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తుండటం ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు జరపడానికి వీలు పడనున్నదని పోస్టాఫీస్ వర్గాలు వెల్లడించాయి.