న్యూఢిల్లీ, మే 14: పలు బ్యాంకుల వద్ద వేలాది కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాద్వాన్ను అరెస్ట్ చేసింది సీబీఐ. బ్యాంకుల కన్సార్షియం వద్ద రూ.34 వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన విషయం తెలసిందే. ఈ కేసులో వాద్వాన్ను ముంబైలో సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న సీబీఐ..మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో 2022లోనే సీబీఐ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.